లీవర్‌లో 5 సెం.మీ చేప ముల్లును తొలగించిన  వైద్యులు.

లీవర్‌లో 5 సెం.మీ చేప ముల్లును తొలగించిన  వైద్యులు.

విశ్వంభర, బషీర్ బాగ్: అత్యంత అరుదైన, క్లిష్టమైన రెండు శస్త్ర చికిత్సలను కూకట్పల్లి చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ సీఈఓ, వాస్క్యులర్ సర్జన్ డా. సంజీవరావు వెల్లడించారు. ఈ గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య బృందంతో కలసి ఆయన  వివరాలు వెల్లడించారు. గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్స్‌కు వచ్చిన రాజమండ్రికి చెందిన కనకదుర్గ (50) మహిళకు లివర్‌లో సుమారు 5 సెం.మీ పొడవైన చేప ముల్లు  ఇరుక్కుపోయి ఉన్నట్లు స్కానింగ్‌లో తేలిందన్నారు. ఈ ముల్లు పేగుల నుంచి లివర్‌లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీసిందన్నారు. వెంటనే శస్త్రచికిత్సతో ముల్లును తొలగించినట్లు తెలిపారు. మరో కేసులో 80 ఏళ్ల వృద్ధుడు కాలిలో రక్తప్రసరణ ఆగిపోవడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలో అత్యాధునిక రివాస్కులరైజేషన్ విత్ యాంజియోప్లాస్టీ అండ్ ఐవీఎల్ చేసి కాలు కాపాడినట్లు తెలిపారు. అలాగే వృద్ధుడికి ఉన్న ప్రోస్టేట్ సమస్యకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్(పీఏఈ) ద్వారా సమస్యను సరిచేశామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్య బృందం డా.అనీల్, డా.భార్గవ్, డా.లీనా, డా.తైబా, డా.శిల్ప, డా.పావని, డా.వంశీ, డా.సుందర్ సింగ్ పాల్గొన్నారు.

Tags: