20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు

20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు

విశ్వంభర, కందుకూరు : కందుకూరు  మండలం గుమ్మడవెల్లి గ్రామం ప్రాథమిక కొన్నత  పాఠశాలలో 2006- 2007, 7thబ్యాచ్ విద్యార్థులు మరోసారి కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా గెట్ టుగెదర్ నిర్వహించారు. గుమ్మడవెల్లి గవర్నమెంట్ స్కూల్లో వద్ద మొదటి సమావేశం నిర్వహించగా, 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే స్నేహ బంధంతో సమావేశమయ్యారు . ఈ కార్యక్రమంలో స్నేహితులు ఒక్కరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. స్కూల్ రోజుల్లో  సరదా సంఘటనలు, గురువుల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అందరూ భావోద్వేగానికి లోనయ్యారు, ఇలాంటి సమావేశాలు స్నేహాన్ని మరింత బలపరుస్తాయని, భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా పరస్పరం సహకారం అందించుకుంటూ, అవసర సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని సంకల్పిం చారు. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో, శేఖర్ చారి, పి మహేష్ గౌడ్, పి రాఘవేందర్, మురళి, ఎన్ మహేష్ గౌడ్, మల్లేష్, దేవేందర్ గౌడ్,శ్రీశైలం, వెంకటేష్, సర్వేశ్, వినోద్, యాదగిరి, పి శేఖర్,జి శ్రీలత, జి మంజుల, బాలమణి మమత, రోజా, సరోజ, సునీత, స్వాతి,సుగుణ, శివలీల, ప్రేమలత, స్వాతి, రజిత, మమత, మాధవి, మౌనిక, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Tags: