దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. - రాజస్వ మండలాధికారి ఆర్ శ్రీదేవి కి వినతిపత్రం అందజేత.
- న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి.
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్.
- మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధికారులకు వినతిపత్రాలు.
విశ్వంభర, చండూర్ :- రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. TGEJAC పిలుపు మేరకు చండూర్ రాజస్వ మండలాధికారి ఆర్ శ్రీదేవి కి చండూరు మండల TPUS మరియు ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల పక్షాన వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయని . ఇవే కాకుండా న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలో సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు భోజన విరామ సమయంలో డివిజన్, మండల కేంద్రాలలో ఆర్డీఓలకు, తహశీల్దార్లకు వినతిపత్రాలను ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. దీనికి సంబంధించి పలు డిమాండ్లను ప్రస్తావించడం జరిగింది.ఈకార్యక్రమంలో TPUS మండల అధ్యక్షులు బావoడ్ల వీరేశం, ప్రధాన కార్యదర్శి పి బాలస్వామి, జిల్లా కార్యదర్శి దోటి కిషన్ ప్రసాద్ వివిధ సంఘాల బాధ్యులు, పెన్షనర్స్,రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
*తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) ప్రధాన డిమాండ్లు*
👉 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి.
👉 రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి.
👉 హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి.
👉 సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి.
👉 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ఇచ్చి తరువాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
👉 పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి.
👉 గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి.
👉 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
👉 ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి.
👉 ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.



