డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
రవీంద్ర భారతిలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డును ప్రధానం
విశ్వంభర,హైదరాబాద్ : మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకును అందజేశారు. చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.



