యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు

ప్రభుత్వ ఉద్యోగాలే కాక ఇలాంటి జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి . -బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సమత 

యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శోభా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ ను డా. హరి కిషన్ ఐ కేర్ హాస్పిటల్, బర్కత్‌పుర లో  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సమత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు రిబ్బన్ కట్ చేసి జాబ్ మేళ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు ప్రతిఒక్కరు ఇలాంటి జాబ్ మేళ ను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని అన్నారు. అలాగే నిరుద్యోగులు ప్రభుత్వ , పబ్లిక్ సెక్టార్ జాబ్ ల కోసం వేచి చూడకుండా ఇలాంటి జాబ్ మేళా లను ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే స్టార్ట్ అప్ ఇండియా , స్టాండ్ అప్ ఇండియా , ముద్ర లోన్ ల ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలను పొంది పుచ్చుకోవాలని అన్నారు. జాబ్ మేళా నిర్వాహకులు డా. సమతా , డా. అనంద్ లను వారు అభినందించారు. అలాగే డా. సమతా మాట్లాడుతూ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం చాల సంతోషముగా ఉందని అన్నారు. నేటి సమాజంలో నిరుద్యోగులుకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయిందని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నంలో ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. మరికొంతమంది యువత ఇలాంటి జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 కంపెనీ లు వచ్చాయని సుమారు 200 మందికి పైగా జాబ్ మేళాను సందర్శించటానికి వచ్చారు అని అన్నారు. అలాగే అర్హత కలిగిన 100 మందికి పైగా  వారికి అప్పోయింట్మెంట్ లెటర్స్ ను అందించడం సంతోషముగా ఉందని అన్నారు. 

Tags: