నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

విశ్వంభర, నారాయణగూడ : విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారని నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విడుదలైన పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) ఫలితాల్లో నారాయణగూడ లోని నారాయణ స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షల్లో జి. శ్రీ లహరి 600 మార్కులకు 595 సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఖాన్ ముజమ్మిల్ 594 మార్కులు సాధించగా, సాయి కృష్ణ, భార్దే కోమల్ తలా 592 మార్కులు సాధించారు. మొత్తం 13 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించగా, 31 మంది 550కి పైగా, 68 మంది 500కి పైగా మార్కులు సాధించారు. స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో సంబరాలు నిర్వహించగా, విద్యార్థులు బాణాసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బాల పరమేశ్వర రావు, కోఆర్డినేటర్ అజాద్, ఆర్‌పీడీ మానిటర్, ప్రిన్సిపల్ విశాఖ, ఏడి మహేష్, ఏడి జుబైర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: