ప్రజా ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం
- సర్పంచ్ సబితా యుగంధర్ రెడ్డి
:విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో సర్పంచ్ కొంతం సబితా యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 35 ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుత ప్రజా ప్రభుత్వ హయాంలో మన గ్రామానికి 35 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలు విజయవంతంగా పూర్తి కావచ్చాయని సర్పంచ్ తెలిపారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు గ్రామంలో వెలుగులు నింపేందుకు అదనంగా మరో 3 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇది సామాన్యుల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు యూత్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సరికొండ జగన్, కత్తుల వెంకటేష్, అనేగౌని పాండు గౌడ్, మద్దెల శ్రీశైలం, బాలమల్లేశ్ యాదవ్, గోపాల్ రెడ్డి, నవీన్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు మలగల విజయ్, కమిటీ సభ్యులు అనేగౌని నవీన్ గౌడ్, యుగంధర్ రెడ్డి, ఎర్ర మాధవి రాములు, ఇటమోని యాదమ్మ, బాల మల్లేష్ యాదవ్, పార్టీ నాయకులు యలల రాఘవేందర్, వలిగే కృష్ణ, హరీష్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



