అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు : సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు : సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ

 విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన జ్ఞానాది రమ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇల్లు నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జనార్ధన్ గౌడ్ తో  ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి నిరుపేదను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేస్తానని గ్రామస్తులకు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిని గోపాల్ రెడ్డి, అరటి కుమార్, శ్రీనివాస్ చారి, వినయ్ చారి, పరమేష్ చారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: