పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 

పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 

విశ్వంభర,హయత్ నగర్ :- పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం పరీక్షల్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు పోటీస్థాయిని మరింత పెంచారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల నుండి 182 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణతతో పాటు మేధాన్ శ్రీరామ్ 597 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. వరుసగా 596 మార్కులతో కిలారి లలిత్. 595 మార్కులతో డి సాయి మనితేజ. 594 మార్కులతో వరుణ్ తేజ్  రాష్ట్రస్థాయిలో రెండవ.మూడవ. నాలుగవ స్థానంలో నిలిచారు.  ఈ విద్యా సంవత్సరం రాష్ట్రస్థాయిలో వరుసగా నాలుగు స్థానములు సాధించి పాఠశాల చరిత్రలోనే సువర్ణాక్షరాలతో ఫలితాలను లిఖించినారు. ఈ విద్యా సంవత్సరం 182 మంది విద్యార్థులలో 590 కి పైగా మార్కులు 11 మంది విద్యార్థులు సాధించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం  పై నారాయణ గ్రూప్ డైరెక్టర్ రమానారాయణ, జిఎం గోపాల్ రెడ్డి , పాఠశాల డీన్  మదనాచారి, ఏ జి ఎం సదాశివుడు ' పాఠశాల ప్రిన్సిపాల్  సురేష్  విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలకు కారణమైన ఉపాధ్యాయ బృందాన్ని. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించినారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలకు విద్యార్థులను ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 
పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు డాక్టర్ వైభవ్ రెడ్డి అభినందనలు
పదవ తరగతి ఫలితాల్లో విశ్రా ది స్కూల్ విజయదుందభి 
యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు
సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.
చేనేతల వ్యూహాత్మక సమావేశం. - కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్
అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి