పదవ తరగతి పరీక్షల్లో ఫలితాల పరంపర - కృష్ణవేణి టాలెంట్ స్కూల్

పదవ తరగతి పరీక్షల్లో ఫలితాల పరంపర - కృష్ణవేణి టాలెంట్ స్కూల్

విశ్వంభర/ సరూర్ నగర్ :-స్థానికంగా పేరుగాంచిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లింగోజిగూడ బ్రాంచ్ లో పదవ తరగతి పరీక్ష ల ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచింది. ఈ విద్యా సంస్థలో 100% ఉత్తీర్ణతను సాధించడమే కాకుండా, అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించింది. ఈ ఫలితాల్లో సాయి పవన్ 581 మార్కులతో మొదటి స్థానం సాధించగా, అక్షిత్ 551 మాటలతో రెండో స్థానం దక్కించుకున్నాడు. అదేవిధంగా 500 పైగా మార్పు సాధించిన విద్యార్థులు మొత్తం 14 మంది ఉండడం విశేషం. ఈ విజయానికి విద్యార్థులకు కృషి పట్టుదలతో పాటు ప్రధాన కారణమని స్కూల్ డైరెక్టర్ ఆలపాటి కామేశ్వరరావు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ శ్రీనాథ్, ప్రిన్సిపల్ రామారావు, నవీన్ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ సాధించిన ఈ విజయం పై తల్లిదండ్రులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:  

Advertisement