సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ధొంతం సంజీవ రెడ్డి, ఆర్ఐ సునిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ముచ్చర్ల యాదగిరి ,నల్ల రఘుమారెడ్డి, పవన్ కుమార్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: