కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన 600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు , ఎస్జి. సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించా రు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వెలువడిన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని , విద్యార్థులు జిల్లాస్థాయి మార్కులు సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, దీంతోపాటు 100% ఫలితాలు సాధించారని మీడియాకు తెలిపారు . అనంతరం ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ , అధ్యాపక బృందం , అభినందించారు . అంతేగాకుండా విద్యార్థులు మాట్లాడుతూ మేము ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి సహకరించిన స్కూల్ మేనేజ్మెంట్, అధ్యాపక బృందం , తల్లిదండ్రులకి , కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు అన్నారు



