హాలియా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం
విశ్వంభర, హాలియా: పురపాలక సంఘం హా లియాలో వార్డ్ ఆఫీసర్,జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గాదె వెంకట రామచంద్రారావు పదవి విరమణ కార్యక్రమం సాగర్ రోడ్డులోని వైభవ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ, వార్డు ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్గా తన బాధ్యతను అంకిత భావముతో నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేశారు ఆయన చేసిన సేవలు మన మున్సిపాలిటీకి ఆదర్శప్రాయంగా నిలిచాయి సహ ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం ప్రతి పనిని నిజాయితీగా బాధ్యతగా తీసుకొని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జి.వి.ఆర్.రావు కేవలం పనికి పరిమితం కాలేదు కొత్త వాళ్లకు సహాయం చేయడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింతగా గొప్పగా నిలబెట్టాయి వారి యొక్క శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యేసు రాజు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చేరుపల్లి ముత్యాలు రెండవ వార్డు కౌన్సిలర్ సలహాదారులు నకిరే కంటి సైదులు ఐదవ వార్డు కౌన్సిలర్ సలహాదారుడు చిట్టి ప్రో లు కరుణాసాగర్ 8వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మహిమద్దీన్ 12వ వార్డు కౌన్సిలర్ సలహాదారు రంజిత్ ఎడవల్లి కో ఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ అనుముల మండల ఎమ్మార్వో ఎంపీడీవో హాలియా మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.



