సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
- సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
విశ్వంభర, మహబూబాబాద్: సోమలతండ గ్రామపంచాయతీలో గురువారం 33/ 11 కెవి కి సంబంధించిన నూతన సబ్ స్టేషన్ కొరకు పురోహితులతో భూమి పూజ ఎమ్మెల్యే చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ, సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు రాష్ట్ర ప్రజలకు , మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు . మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని , రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుందని , ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారీ , విద్యుత్ శాఖ డి ఈ లు , పర్వతగిరి , సోమల తండా , లక్ష్మ తండా, గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు , సంబంధిత అధికారులు , గ్రామస్తులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు , రైతులు , భారీ సంఖ్యలో పాల్గొన్నారు .



