అనంతా రం మోడల్ స్కూల్లో జిల్లాస్థాయిలో ర్యాంకులు
On
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి . ఇందులో భాగంగా అనం తారం మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని , విద్యార్థులు మొత్తం 600 మార్కులకు గాను ఐదుగురు విద్యార్థులు జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించి విజయం సాధించారు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు మాట్లాడుతూ మా స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు దీని వెనుక విద్యార్థులకు విద్యను నేర్పించిన అధ్యాపక బృందానికి, ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి తల్లిదండ్రులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీడియాకు తెలిపారు



