పదో తరగతి ఫలితాల్లో జయ పాఠశాల జయకేతనం
విశ్వంభర, సూర్యాపేట: 10వ తరగతి ఫలితాలు జయ పాఠశాల ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ లు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ డి రిత్విక స్టేట్ రెండవ ర్యాంక్ 596 సాధించడంతోపాటు 11 మంది విద్యార్థులు 590 పైన మార్కులు సాధించాలని తెలిపారు. 11 మంది 590 ఆపైన 61 మంది 580 143 మంది 570 ఆపైన 238 మంది 560 ఆ పైన 330 మంది 550 586 మంది 500 ఆ పైన మార్కుల తో పాటు హాజరైన ప్రతి ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు 500 ఆ పైన మార్పులు సాధించారని తెలిపారు. దాసరి రిత్విక 596 బోడ ప్రసన్న 595 కట్ట దేవి ప్రియ 594 పోతుగంటి శ్రీ శ్వాస 594 బుడిగ సాన్విక 593 తిప్పన శ్రీజ రెడ్డి 593 కై రోజు హేమంత్ సాయి 592 భూ రెడ్డి హర్షిత 591 కక్కిరేణి ప్రజ్వల 591 నిమ్మల వైశాలి 591 తోవిటి సహస్ర 591 సాధించినట్లు తెలిపారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను కృషి చేసిన అధ్యాపక బృందాన్ని సహకారం అందించిన తల్లిదండ్రులను అభినందించారు.



