చంద్రాయణగుట్టలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
విశ్వంబర,చంద్రాయన గుట్ట :-చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని లలిత బాగ్ డివిజన్లో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా కార్యక్రమానికి చాంద్రాయణ గుట్ట బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముప్పిడి సీతారాం రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ముప్పిడి సీతారాం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వన్నెతెచ్చిన పార్టీ బి ఆర్ఎస్ పార్టీ అని, ఇవాళ ఆవిర్భావ దినోత్సవం లో ప్రతి గల్లీలో ఈ జెండాలు ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే కాలంలో మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీ పుంజుకొని తెలంగాణలో పగ్గాలు చేపడుతుందని, ప్రజలు నిరాశ పడవద్దని, తెలంగాణకు పట్టిన పీడవిరగడవుతుందని, కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కి ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మి చెట్టు రాజు, గుడ్ల రవీందర్, ప్రభాకర్, జనార్ధన్, మరియు పార్టీ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



