మందకృష్ణ పోరాటం ఎవరికోసమో స్పష్టం చేయాలి

మందకృష్ణ పోరాటం ఎవరికోసమో స్పష్టం చేయాలి

  • గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్

విశ్వంభర, బషీర్ బాగ్: మందకృష్ణ పోరాటం మాదిగల కోసమా? క్రైస్తవుల కోసమా? స్పష్టం చేయాలని గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి వేదాంతి పాండే తోకలసి ఆయన మాట్లాడారు. మాదిగల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ హైకోర్టులో ఎన్ని ప్రతిపాదనలు చేశారని, ఎన్ని జీవోలు తీసుకువచ్చారో స్పష్టం చేయలని ఆయన డిమాండ్ చేశారు. సరియైన అవగాహన లేకుండా మందకృష్ణ మీడియాలో హల్చల్ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే దేవాలయాల్లో సరైన కైంకర్యాలు జరగడం లేదని విమర్శించారు. దేవాలయాల్లో పద్ధతులు తెలిసిన బ్రాహ్మణ మహిళలనే ఈవోలుగా నియమించాలని ప్రభుత్వానికి గిరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సమాజం దేవాలయాలకే కాదు, దేశానికే పేటెంటు అని, దేశాన్ని కాపాడుకునే అంశంలో ప్రధాన పాత్ర బ్రాహ్మణులదే అని  ఆయన అన్నారు. మతం మారిన బ్రాహ్మణులతో తమకు సంబంధం లేదని, వారిని తాము ఎప్పుడో వెలివేశామని చెప్పారు. మాదిగల హక్కులు, వారి సంక్షేమం, భవిష్యత్తు కోసం సరైన మాదిగ మేధావులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కులం, మతం గురించి సరియైన అవగాహన లేని బైరి నరేష్, కంచె ఐలయ్య, మందకృష్టలు వారి వారి కులాలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణుల కేవలం అర్చకత్వమే కాదని, రాబోయే రెండేళ్లలో ఆలయ ఈఓలుగా కూడా బ్రాహ్మణులే ఉండేలా చట్టం తీసుకువస్తాం అని ఆయన అన్నారు.

Tags: