పది ఫలితాల్లో షైన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
విశ్వంభర, హనుమకొండ: బుధవారం విడుదలైన పది ఫలితాల్లో షైన్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. బాలసముద్రం లోని షైన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ.అక్షర 588 మార్కులు సాధించినట్లు,ఎల్.రేవంత్ ఎండీ. ఆఫ్రోజ్ 586 మార్కులు, సమీర నాయీమ్ 585,వెలుదండి సీమ,సంహిత సుమిత్ 584 మార్కులు,హాసిని,ప్రశాంతి,సుశాంత్, సి.హెచ్.సిరి 583 మార్కులు, జాహ్నవి, మార్క శ్రీధన్ 582,హర్షిణి 581,యతీష్ ,హర్షిత 580 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మూగల రమా యాదవ్,సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, ప్రిన్సిపాల్స్ విశాల్,దినేష్,రాజ్ కుమార్,కవిత, ప్రగతి రెడ్డి, సబితా,మానస, కాలేజి ప్రిన్సిపాల్స్ రాజు గౌడ్,శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు



