ద ప్రజలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం

ద ప్రజలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం

  • ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

   విశ్వంభర,  హనుమకొండ: పేద ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని హనుమకొండ డిసిసి అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  అన్నారు. ఆత్మకూరు గ్రామంలో లబ్ధిదారుడు మంతుర్తి ఓదెలు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం వేడుకకు హనుమకొండ డిసిసి అధ్యక్షులు , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఓదెలు  కుటుంబసభ్యులతో రిబ్బన్ కట్ చేపించి ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, కానీ నేటి ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పర్వతగిరి మహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: