తెలంగాణలో రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులు

తెలంగాణలో రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులు

  • మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక 

విశ్వంభర, బర్కత్‌పుర :బీజేపీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గ రాష్ట్ర, నగర పదాధికారులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం హైదరాబాదు బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో దాదాపు రూ.7,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభకు విస్తృతంగా ప్రజలను తరలించేందుకు కరపత్రాల పంపిణీతో ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. బస్తీలు, కాలనీలు, కుల సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, ఎడెల్లి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: