ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.
విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం, త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్ చింతారెడ్డి యాదగిరి రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ మండల బాధ్యులు...పగిళ్ల సైదులు,రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు