బీరప్ప  పండుగను ఘనంగా జరుపుకోవాలి 

బీరప్ప  పండుగను ఘనంగా జరుపుకోవాలి 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం  మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ కార్యాలయము లో మే 2 నుండి 7 వరకు జరిగే శ్రీ మహంఖాళీ, బీరప్ప పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని మహేశ్వరం గ్రామములోని శ్రీ శ్రీ బీరప్ప దేవాలయము వద్ద బీరప్ప పండుగకు  వచ్చే భక్తులకు తాగునీటికి  ఎలాంటి ఇబ్బందులు, తలెత్తకుండా ఉండుటకు గాను  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్  ముందస్తు చర్యగా బీరప్ప దేవాలయము వద్ద  నూతన బోర్ మోటార్ ను ప్రారంబించడం జరిగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ, గ్రామములో వేసవి కాలములో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రతి వార్డులో బోర్ మోటార్స్ డ్రిల్లింగ్ చేయడముతో పాటు నూతన మోటార్ పంప్ సెట్స్ బిగించడము జరుగుతుందని తెలిపారు.   గ్రామములొని ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజిలు, సీసీ రోడ్ల నిర్మాణములు చేపట్టడము జరుగుతునదని, అన్ని రకాలుగా ప్రజలందరికీ తగిన మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. గ్రామములొ జరిగే బీరప్ప ఉత్సవాలను గ్రామ ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణములో సంతోషకరముగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లో మహేశ్వరం గ్రామ ఉప సర్పంచ్ జొరల రమేశ్, వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, అబ్దుల్ జావిద్,నాయకులు ,ఆవులకడి శ్రీశైలం ,టింగీర్కరి మక్కజీ ,సున్నం కృష్ణ ,మిద్దింటి బల్రజ్ ,పోల్కం కిష్టయ్య ,పోల్కం బాలయ్య ,మిద్దింటి బీరప్ప , గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags: