పది పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించిన రామన్ స్కూల్
విశ్వంభర, హనుమకొండ: బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రామన్ హైస్కూల్ విద్యార్థులు 100 శాతం ఫలితాలు
సాధించినట్లు రామన్ పాఠశాల కరస్పాండెంట్ రాజేశ్ కుమార్, డైరెక్టర్ పురుషోత్తం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ కాసర్ల సిరి చందన 579 మార్కులు,జన్ను ఆశ్రీత 577 మార్కులు,నిద కొనైన్ 572,వడ్డేపల్లి రిశ్విన్ 572,అల్లాడి నవనీత్ సాయి 569,కాసిరెడ్డి అవినాష్ 568,అక్కినపల్లి శ్రీనిధి 568,నాగిరెడ్డి హానిష్ 566,కుద్సియా జీనత్ 565,కొల్ల సాయి ప్రజ్వవ్ రెడ్డి 564,అనీమ్ 562 మార్కులు సాధించినట్లు తెలిపారు.550 కి పైగా 19 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. మొత్తంగా 72 శాతం మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేష్ కుమార్, డైరెక్టర్ పురుషోత్తం,ప్రిన్సిపాల్స్ స్రవంతి,చంద్రప్రకాష్,వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాద్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



