చేనేతల వ్యూహాత్మక సమావేశం. - కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్

తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల పర్యటనకు అధ్యయన కమిటీ-

చేనేతల వ్యూహాత్మక సమావేశం. -  కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్

విశ్వంభర, హైదరాబాద్ :- చేనేతల హక్కుల సాధనకై వివిధ రూపాలలో వివిధ సంఘాలు మరియు వేదికల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలు, ప్రభుత్వంలో వస్తున్న కదలికలు మరియు భవిష్యత్తు కార్యచరణ పై వ్యూహరచన సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చ, లోతైన అధ్యయనం, సమాలోచనల తర్వాత  చేనేత అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరియు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో క్షేత్రస్థాయి అధ్యయనం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో విధాన పత్రాన్ని రూపొందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నివేదిక భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఒక దిక్సూచిగా ఉండాలని సమావేశం  అభిప్రాయపడింది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు చేనేతలను ఎన్నికల ఓటు బ్యాంకు కేంద్రకంగా రూపకల్పన చేసే పథకాలు మరియు బడ్జెట్ కేటాయింపులు శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టలేకపోయాయి. హ్యాండ్లూమ్ పాలసీ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేనేత కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేనేత అధ్యయన కమిటీ మరియు న్యాయపరంగా మన హక్కుల సాధన కొరకు లీగల్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ఇప్పటివరకు చేనేత కళాకారుల సంక్షేమం చేనేత రంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సంఘాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి అన్ని జిల్లా కేంద్రాలలో సమావేశాలు నిర్వహించాలని,  త్వరలోనే ముఖ్య నేతలను ఆహ్వానించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడమయినది.  ఈరోజు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి. చిరంజీవులు, చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత  పాల్గొనగా ఈ సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరి అనివార్య కార్యక్రమాల వల్ల హాజరుకాలేకపోయిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి  అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఫోన్లో మాట్లాడారు.

Tags: