అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి

అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి

విశ్వంభర హనుమకొండ జిల్లా :-హనుమకొండ జిల్లా కాజిపేట మండలం కడిపికొండ గ్రామం  సూర్యకుటీర్ వెంచర్ లోని శ్రీశ్రీ భూనీళ సమేత శ్రీ సంపత్ వేంకటేశ్వర స్వామి చతుర్థి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ భూనీలా సమేత శ్రీ సంపత్  వేంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీమాన్ యజ్ఞాచార్య కలకోట సీతారామ చార్యుల ఆధ్వర్యంలో  ఆలయ పూజారి పొడిచేటి లక్ష్మణాచార్యులచేనిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు కీ,,శే,, తంగళ్లపల్లి సంపత్ కుమార్ సతీమణి తంగళ్లపల్లి తిరుమలాదేవీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలాదేవీ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని,ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.ఈ రోజు శ్రీ భూనీలా సమేత శ్రీ సంపత్ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.అనంతరం ఆంజనేయ స్వామి భక్తులకు,ఆలయ భక్తులకు, బంధుమిత్రులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య కుటీర్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్,మానస దంపతులు,కుమార్తె వైష్ణవి,బంధుమిత్రులు,సూర్యకుటీర్ మిత్రులు,తదితరులు పాల్గొన్నారు.

Tags: