మూడు నెలల బియ్యం ఎప్పుడు
On
విశ్వంభర, చంద్రాయణ గుట్ట: మూడు నెలల రేషన్ బియ్యం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని మభ్యపెడుతున్నాయంటూ చంద్రాయణ గుట్ట బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఆకుల శ్రీనివాస్ మండిపడ్డారు. మరి మూడు నెలలకు సరిపడా గోధుమలు ఎందుకు ప్రజలకు ఇవ్వట్లేదని ఒక్క నెల గోధుమలు మాత్రమే ఇవ్వడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలకు అర్థమవుతుందని ప్రజలు ఈ నిర్లక్ష్య ధోరణిని చూస్తూ కూర్చోరని హెచ్చరించారు. వచ్చేది బిఆర్ఎస్ పాలనని, కల్లబొల్లి మాటలతో ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కి కూర్చుని ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చకుండా రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.



