పదో తరగతి ఫలితాల్లో ‘వ్రిహా’ స్కూల్ వంద శాతం ఉత్తీర్ణత
టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ
విశ్వంభర, అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లోని వ్రిహా స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలను నమోదు చేసింది. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది స్కూల్ నుండి 32 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేయడం విశేషం.పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రథమ స్థానం అక్షిత 600 మార్కులకు గాను 588 మార్కులు ద్వితీయ స్థానం, హాసిని 586 మార్కులు తృతీయ స్థానం శ్రేయ 580 మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ఛైర్మన్ విజయ కృష్ణ నగదు పురస్కారాలను అందజేశారు. స్కూల్ టాపర్ అక్షితకు రూ. 25,000, ద్వితీయ స్థానంలో నిలిచిన హాసినికి రూ. 15,000, తృతీయ స్థానంలో నిలిచిన శ్రేయకు రూ. 10,000 నగదును అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ..విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ మరియు నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి.అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. ప్రియబాంధవి, ప్రిన్సిపల్ జి. రాధిక, అధ్యాపక బృందం, విద్యార్థులు , వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



