పదవ తరగతి ఫలితాలలో ఆర్బిట్ ఉత్తమ ప్రదర్శన
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ జిల్లాఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఇ- టెక్నో స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి, డైరెక్టర్ హారిక భగవాన్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో అత్యధికంగా ఎం.సాయి కిరణ్ రెడ్డి 576, ఎల్. గగనశ్రీ 573, టీ.ప్రచురిత 570, కే. సుస్మిత 570, ఏ, తిరుపతి 570 మార్కులు సాధించారు. 129 మంది విద్యార్థిని, విద్యార్థులలో 570 కి పైగా ఐదుగురు, 560 కి పైగా 19 మంది, 550 కి పైగా 31 మంది, 540 కి పైగా 44 మంది, 500 కి పైగా 94 మంది విద్యార్థిని, విద్యార్థులు మార్కులు సాధించారు. సబ్జెక్టుల వారీగా గరిష్టంగా తెలుగులో 100, హిందీలో 100, ఇంగ్లీషులో 96, మ్యాథమెటిక్స్ లో 100, జనరల్ సైన్స్ లో 98, సోషల్ లో 99 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి, డైరెక్టర్ హారిక భగవాన్ రెడ్డి లు అకాడమిక్ ఇంచార్జ్ వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మధుకర్, సారంగపాణి, జావిద్ ఖాన్, మహేష్, చంద్రమోహన్, ప్రశాంత్, వెంకటేష్, శ్రీనివాస్, శ్వేత, రజిత, రాధిక, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



