గుండాల నూతన ఎస్‌ఐగా శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ

గుండాల నూతన ఎస్‌ఐగా శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ

విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలతో సన్నిహిత్యంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, మండల ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags: