పదవ తరగతి ఫలితాల్లో విశ్రా ది స్కూల్ విజయదుందభి
100% ఉత్తీర్ణతతో విశ్రా ది స్కూల్ విజయకేతనం
విశ్వంభర,బాలాపూర్:- పరీక్ష ఫలితాలలో విశ్రా ది స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.డీ. రుత్విక్577/60, బి. ఆదిత్య రెడ్డి 573/600, బి. భవాని 572/600, కె. శ్రీనిజ 571/600, బి ప్రణవ్ తేజ 570/600 ఈ ఐదుగురు విద్యార్థులు 570 మార్క్స్ పైన సాధించారు. 100% ఉత్తీర్ణత తో పాటు 500 మార్కుల పైన 23 మంది విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ విజయానికి కారణమైన ప్రిన్సిపల్ దూడపాక సురేష్ నీ , ఏవో దీప్తిరామం నీ పాఠశాల అధ్యాపక బృందాన్ని, విజేతలైన విద్యార్థినీ విద్యార్థులను విశ్రా ది స్కూల్ సంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ అభినందించారు. విశ్రా జూనియర్ కళాశాల నుండి జేఈ మెయిన్స్లో 11మంది ఎన్ఐటీ సీట్లు సాధించబోతున్నారని, ఐపీఈలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 470 కి 460 పైన 23 మంది విద్యార్థులు సాధించారు. ఫస్ట్ ఇయర్ బైపిసి లో 440 కి 430 పైన 9 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ లో 1000 కి 950 పైన 75 మంది విద్యార్థులు సాధించారు.మొత్తంగా 40% శాతం విద్యార్థులు 90% మార్కుల పైన ఫలితాలు సాధించారని డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ ప్రకటించారు. విద్యార్థుల అభివృద్ధికి విశ్రా సంస్థలు నిరంతరం కృషి చేస్తాయని సంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ తెలిపారు.



