పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు డాక్టర్ వైభవ్ రెడ్డి అభినందనలు
On
విశ్వంభర, చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు చేవెళ్ల నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ కృషి, పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులు వెలుగులోకి రావడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువుల్లో కూడా రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అలాగే, పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ, కష్టపడి చదవడం కొనసాగించాలని సూచించారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తోడ్పడే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.



