మాంజా దారంతో పక్షుల మృతి
On
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కులో వేసవికాలంలో వలస పక్షులకు ముప్పు పొంచి ఉంది. చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఉన్న పతంగుల మాంజా దారాలకు పక్షులు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షుల కిలకిలలతో కళకళలాడాల్సిన పార్కులో ఈ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాంజా దారాల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.



