విద్యార్థులకు మోటివేషన్ తరగతులు 

విద్యార్థులకు మోటివేషన్ తరగతులు 

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు ఎలా రాయాలి, వత్తిడి ఎలా తగ్గించుకోవాలో, అందరితో ఎలా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఎలాగా మాట్లాడాలి, తల్లితండ్రులతో, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు.  ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి, డైరెక్టర్ అవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,  విద్యార్థుల పరీక్షల సమయంలో మానసిక వత్తిడిని తగ్గించేలా ప్రతి సంవత్సరము ఇలాంటి మోటివేషనల్ తరగతులు విద్యార్థులకు నిష్ణతుల చేత నిర్వహించడం జరుగుతుంది, అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: