గ్యాస్ కొరతతో కుదేలవుతున్న హోటల్ రంగం
విశ్వంభర, సూర్యాపేట:సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ కొరత సమస్యలపై తిరుమల గ్రౌండ్ లో చర్చించారు. ఈ సందర్భంగా స్టేట్ ఈసీ మెంబర్ పానుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల లభ్యత లేకపోవడంతో సుమారు 200 హోటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యాపార లావాదేవీల్లో దాదాపు రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లుతోందని.. అంతేకాకుండా వేలమంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ తాము హోటల్స్ మెనూ రేట్లు పెంచలేదని, అయితే ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ధరలు సవరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. హోటల్ అసోసియేషన్ సంఘం సభ్యులు రమేష్ మురళీకృష్ణ లక్ష్మణ్ పరమేష్ ప్రవీణ్ విశాల్ లతీఫ్ తదితర సంఘ సభ్యులు ఉన్నారు.



