బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు

బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు

ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. నిజాలను దాచిపెట్టి, స్కామ్‌ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లడం తగదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

2025 మే నెలలో 'సైట్‌ సర్టిఫికెట్‌' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారని హరీశ్ రావు తెలిపారు. ఈ నిబంధన వల్ల తొలి లబ్ధిదారు సీఎం బంధువు, శోధా కన్‌స్ట్రక్షన్‌ యజమాని సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు ఆరోపించారు. అప్పటి నుంచి ప్రతి టెండర్‌కు 'సైట్ విజిట్' నిబంధన పెట్టి, 'ప్లస్ టెన్' పద్ధతిని ఫాలో అవుతూ అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. 

Read More అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్

కుంభకోణం జరగలేదని భట్టి విక్రమార్క నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, పారదర్శకత ఉంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. "నైనీ కోల్‌ బ్లాక్‌ ఒక్కటే కాదు.. సైట్‌ విజిట్‌ నిబంధన పెట్టిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఇప్పటివరకు ఎన్ని టెండర్లు పిలిచారు? ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి
ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కేవలం తమకు కావలసిన వారికే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తన వద్ద ఫోటోలు, వీడియోలు, కంపెనీలు పంపిన ఈమెయిల్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఈ ఆధారాలన్నీ సమర్పిస్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయటపెడతానని హెచ్చరించారు.