స్కావెంజర్ల సంఘం మండల కమిటీ ఎన్నిక

స్కావెంజర్ల సంఘం మండల కమిటీ ఎన్నిక

విశ్వంభర, ఇనుగుర్తి: స్కావెంజర్ల సంఘం ఇనుగుర్తి మండల  కమిటీని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇసం పెల్లి సైదులు నేతృత్వంలో బూర రజిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షురాలుగా బూర రజిత, కార్యదర్శిగా పొనుగొటి కళమ్మ, ఉపాధ్యక్షులు బూర బుచ్చమ్మ, కేతమ్మ, సహయకార్యదర్శిగా దర్మరపు వెంకటయ్య, సభ్యులు గా హుసేన్బీ, వెంకటయ్య, మహేశ్వరీ, యాకమ్మ లను ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర నేత సైదులు మాట్లాడుతూ స్కావెంజర్లు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతతో పాటు ఇతర అనేక పనులు చేస్తున్నారని వారికి కనీస వేతనం నెలకు రూ.24 వేలచొప్పున చెల్లించాలన్నారు.పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు, అవారి శ్రీనివాస్పా తదితరులు ల్గొన్నారు.

Tags: