సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిటీ పోలీస్ యాక్ట్ అమలు

విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ పరిధిలో ఈనెల 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ బుధవారంనాడొక ప్రకటనలో తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, నిర్వహణకు ముందుగా ఏసీపీ అనుమతి  తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా కార్యాలయాలను మూసేయాలని బెదిరింపులకు గురిచేయొద్దని, మైక్ సెట్ వినియోగం తప్పనిసరైతే అనుమతి తీసుకోవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: