మహేశ్వరంలో  పంచాంగ శ్రవణం 

మహేశ్వరంలో  పంచాంగ శ్రవణం 

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని ఉగాది పర్వదిన సందర్భంగా హనుమాన్ దేవాలయంలో  సర్పంచ్ మునగపాటి నవీన్,  గ్రామ పెద్దల  ఆధ్వర్యంలో  కటేపల్లి శ్యాం సుందర్ శర్మ పంతులు, మడుపతి మణికంఠ పంతులు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. శ్యాం పంతులు  పంచాంగం గురించి వివరిస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది  అని  ఈ సంవత్సరంలో గ్రహ స్థితులు, రాశి ఫలాలు, వర్షం, పంటలు, రాజకీయ పరిస్థితులు వంటి శుభా శుభాలను తెలుపుతుందని, ఈ శ్రవణం వినడం వల్ల శుభం, ఆయుర్వృద్ధి కలుగుతాయని నమ్మకం అనేది , భగవదను గ్రహ కారకం అన్నారు,ఈ కార్యక్రమంలో పోతర్ల అంబయ్య యాదవ్, శివ మూర్తి, ప్రసాద్, అల్లే కుమార్, స్వర్ణగంటి ఆనందం, పోతర్ల సుదర్శన్ యాదవ్, నిమ్మగూడం సుదీర్, కాకి కుమార్, ఒగ్గు శ్రీశైలం, కాడమోని ప్రభాకర్, మక్కాజి, చంద్రమౌళి, భిక్షపతి, బాలయ్య, అంజప్ప, కృష్ణ యాదవ్, కటికల మహేందర్, తెల్జీరి శ్రీశైలం, మిద్దింది బాలరాజ్, కర్రోళ్ల శ్రీనివాస్, దూసగంటి మహేందర్, సత్తయ్య, గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

Tags: