చిర్ర సాత్విక్‌ను అభినందించిన ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి.
On
విశ్వంభర, వరంగల్ :- ఇటీవల తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన 11వ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025–26 పోటీలలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ భీమారం బ్రాంచ్ విద్యార్థి చిర్ర సాత్విక్ పాల్గొని రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి, సాత్విక్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. అల్ఫోర్స్ విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలను సమానంగా ప్రోత్సహిస్తాయి. వివిధ క్రీడలలో ప్రతిభ కలిగిన విద్యార్థులను మా సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, అవసరమైన సదుపాయాలు అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో వందలాది మంది విద్యార్థులు వివిధ క్రీడలలో మెడల్స్ సాధించడం ఆనందదాయకం” అన్నారు. అలాగే సాత్విక్ తల్లిదండ్రులైన చిర్ర రాజు ,శోభా దంపతులను ప్రశంసిస్తూ ఈ రోజుల్లో చాలామంది చదువులపైనే దృష్టి పెట్టే పరిస్థితుల్లో, తమ కుమారుడిని క్రీడల వైపు ప్రోత్సహించిన ఈ దంపతులు నిజంగా అభినందనీయులు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



