ఉపాధిలో కూలీల సంఖ్య పెరిగేలా చూడాలి
- ఉపాధిలో కూలీల సంఖ్య పెరిగేలా చూడాలి
విశ్వంభర, నెల్లికుదురు: ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనులపై నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఈజీఎస్ ఉద్యోగులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సింగారపు కుమార్ అధ్యక్షతన బుధవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. దీనికి డి ఆర్ డి ఓ పి డి మధుసూధన రాజు హాజరై వివిధ పనుల పురోగతిపై ఆరా తీశారు.ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ఉపాధి హామీ లో ప్రతి గ్రామం నుంచి కూలీల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు.పని ప్రదేశంలో వసతులు కల్పించాలని సూచించారు.వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ప్రధమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. నూతన గ్రామపంచాయతీ బిల్డింగుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని రకాల పెన్షన్లు పారదర్శకంగా అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో మాధవి, ఆయా గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, రూపాయి టి సీలు టి ఏ లు తదితరులు పాల్గొన్నారు.



