వీ3 న్యూస్ , విశ్వంభర పత్రిక ప్రధాన కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
విశ్వంభర,హైదరాబాద్ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వీ 3 న్యూస్, విశ్వంభర దినపత్రిక కేంద్ర కార్యలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వీ3 న్యూస్, విశ్వంభర దినపత్రికల చైర్మన్ కాచం సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలను కల్పించిందని పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతున్నామని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. గణతంత్ర దినోత్సవం మనకు కర్తవ్యబోధను గుర్తు చేసే పర్వదినమని అన్నారు.ఈ కార్యక్రమం లో , డైరెక్టర్ కాచం సాయి , నంగునూరి రమేష్, ఎడిటర్ మందాడి భరత్ రెడ్డి , స్టేట్ బ్యూరో దుమ్మాజి నవీన్,సాగర్, మార్కెటింగ్ మేనేజర్ రాజు గుప్తా ,శ్రీధర్,పరమేష్,గురుమూర్తి,వరలక్ష్మి, కోదుమూరి దయాకర్,సతీష్,పురంధేర్ , రమేష్,అన్వర్ తదితరులు పాల్గొన్నారు



