పర్వతగిరి గ్రామంలో గ్రామసభ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో ఘనంగా గ్రామసభ జరిగింది. ఈ గ్రామ సభకు పర్వతగిరి గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రవేశపెట్టిన ప్రణాళికలో ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిందని, మరియు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మనమందరం కలిసి ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకుందామని మన గ్రామస్తులందరూ కలిసి కట్టుగా పనిచేసే మన గ్రామాన్ని సుబ్రం చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందని గ్రామస్తులు తెలిపారు . అంతేకాకుండా ప్రభుత్వం పెట్టి నా కొన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చెందాలని ఈ పథకాలన్నిటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని గుర్తు చేసారు . ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు , గ్రామస్తులు , పాల్గొన్నారు



