ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు
On
విశ్వంభర, అంబర్‌పేట : హనుమాన్ జయంతి సందర్భంగా అంబర్‌పేట పటేల్ నగర్ చౌరస్తాలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



