ఘనంగా పంచముఖి నాగేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం 

ఘనంగా పంచముఖి నాగేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం 

విశ్వంభర , తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామి దేవాల యంలో  20వ వార్షికోత్సవ వేడుకలు గురువారం రోజున ఆలయ అర్చకులు ఓలేటి గీతాచార్యులు , యాదగిరాచార్యులు , నరసింహమూర్తి శర్మ  ఘనంగా నిర్వహించారు . ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాల ను ప్రారంభించారు. పంచ సూక్తపఠనంతో ,గోక్షిరాభిషేకం పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజ ,మహా నివేదన, మంత్రపుష్పం కార్యక్రమాలను శాస్త్రీయంగా నిర్వహించారు. స్వామి వారిని నూతన వస్త్రాలతో పుష్ప మాలతో సుందరంగా అలంక రించారు. అనంతరం  అశ్వత్థ నారాయణ కళ్యాణోత్సవం చేపట్టగా, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం మహాసంకల్పం మొదలగు కార్యక్రమాలను లోక కళ్యాణార్ధం కన్నుల పండుగగా జరిపారు.ఈ కళ్యాణోత్సవంలో సంగారెడ్డిపేట రాహుల్ హరిత దంపతులు స్వామివారికి నూతన వస్త్రాలను, మాంగల్యాన్ని సమర్పించారు. ఈ కళ్యాణవేడుకల లో మునిసిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ ,కౌన్సిలర్ చకిలేలా అలివేణి ,ఆలయ కమిటీ చైర్మన్ గోపారపు నాగేశ్వరరావు సభ్యులు కల్లూరి నాగేంద్ర చారి ధార నాగ శివప్రసాద్ ,నాగరాజు మణికుమార్  మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దీక్ష ప్రసాద వినియోగం చేశారు ఆలయ కమిటీ తరఫున చైర్మన్ శ్రావణ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.

Tags: