సబ్బండ వర్గాలకు  రాజ్యాధికారమే లక్ష్యంle

సబ్బండ వర్గాలకు  రాజ్యాధికారమే లక్ష్యంle

  • లేబర్ పార్టీ  రాష్ట్ర అధ్యక్షులు దశరథ్ నాయక్

 విశ్వంభర, బషీర్ బాగ్: సబ్బండ వర్గాలకు  రాజ్యాధికారం, సమ సమాజ నిర్మాణమే  లక్ష్యమని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఎం. దశరథ్ నాయక్ తెలిపారు. గురువారం బషీర్ బాగ్ లో ఆయన మాట్లాడుతూ,   బీసీలలో,  ఎస్సీలలో రెండు మూడు కులాలు తప్ప, మిగతా కులాలు రాజకీయంగా వెనుక పడ్డాయన్నారు. ఈ కులాలు రాజకీయంగా అభివృద్ధి ఎప్పుడు చెందుతాయని ప్రశ్నించారు. రాజ్యాంగపరంగా అన్ని సుబ్బండ  కులాలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ స్థానాలలో సమాన వాటా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే దేశంలో సకల జనులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు.  ఇప్పటివరకు రెడ్లు, వెలమలు, బ్రాహ్మణ ఆదిపత్య కులాలే రాజకీయంగా , ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నాయన్నారు.  ఇప్పటివరకు అసెంబ్లీ గేటు తాకని ఎస్సీ, బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి అన్నారు.  రాజకీయ పార్టీలు ఎస్సీలను, బీసీలను ఓట్లు ఓట్లు వేసే యంత్రాలు చూస్తూ వారి హక్కులు అధికారాలు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు సమానమే అని రాజకీయంగా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: