ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా  అజయ్ శర్మ

ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా  అజయ్ శర్మ

విశ్వంభర, హైదరాబాదు : ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ శర్మ అదనపు బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా సేవలు ప్రారంభించిన ఆయనకు మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. దాద్రీ, కహల్‌గావ్ వంటి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ ఇంధన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను కలిసి సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎన్టీపీసీ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా అదనపు డీజీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను కూడా కలిశారు.

Tags: