తొలిసారి ఓటు వినియోగించుకున్న యువతి
On
విశ్వంభర,కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం ఐదవ వార్డ్ లో శివంశెట్టి భవాని తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంది. తొలి ఓటు, తొలిసారి ఓటు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటింగ్ లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. అవినీతి రహిత సమాజానికి నా వంతు కృషి చేస్తాను, ఎప్పటికీ డబ్బుకు ఓటు అమ్ముకోనని మాట ఇస్తున్నాను.., తన తొలి ఓటు మున్సిపాలిటీ తొలి ఎన్నికలలో వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని భవాని చెప్పారు.



