రామన్నపేటలో కంటి పరీక్ష శిబిరం

రామన్నపేటలో కంటి పరీక్ష శిబిరం

విశ్వంభర, రామన్నపేట:  యదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రామన్నపేట మండల పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్  మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రామన్నపేట గ్రామ సర్పంచ్ గరిక సత్య నారాయణ రిబ్దన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డీ.జమీరొద్దీన్, పెన్షనర్ అసోసియేషన్ కార్యదర్శి గోదాసు అంజయ్య, కోశాధికారి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు గోవర్ధనాచారి, జిల్లా కార్యదర్శి బొడ్డు వెంకటేష్, టిపి సభ్యులు ఎస్.నరసింహ, బిబిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: