మాస్ మహారాజా 'ఇరుముడి'

మాస్ మహారాజా 'ఇరుముడి'

ఇటీవలే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ, అదే జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.  

విశ్వంభర, సినిమా బ్యూరో: ఇటీవలే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ, అదే జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.  జనవరి 26న రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ పూర్తి అయ్యప్ప మాలధారణలో, నుదుటన విభూదితో ఎంతో నిష్ఠగా కనిపిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది 77వ చిత్రం. ఎప్పుడూ ఎనర్జిటిక్ రోల్స్ చేసే రవితేజ, ఈసారి భక్తి ప్రాధాన్యత కలిగిన ఒక బలమైన ఎమోషనల్ కథతో రాబోతున్నట్లు ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతోంది.

"కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ 'ఇరుముడి'. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని రవితేజ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా..  ఇందులో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇరుముడి’ అనే టైటిల్, రవితేజ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More #Draft: Add 'పల్నాడు'- టైటిల్ పోస్టర్ రిలీజ్ Your Title